ప్రేమ ఓ ప్రేమ.. అంటున్న వరలక్ష్మి! పోలీస్ కంప్లైంట్.. నుంచి లవ్‌సాంగ్
ABN, Publish Date - Mar 02 , 2026 | 08:11 PM
మల్టీ టాలెంటెడ్ వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’.
మల్టీ టాలెంటెడ్ వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఈ చిత్రాన్ని సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మించగా సంజీవ్ మేగోటి (Sanjeev Megoti) దర్శకత్వం వహించారు. శ్రీ హర్ష (Sri Harsha), నవీన్ చంద్ర (Naveen Chandra), రాజశ్రీ నాయర్ (Rajshri Nair), కృష్ణ సాయి (Krishna Sai) , రాగిణి ద్వివేది (Ragini Dwivedi) , రవిశంకర్ (Ravi Shankar ), ఆదిత్య ఓం (Aditya Om) వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు ముస్తాబవుతోంది.
హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంటపై చిత్రీకరించిన "ప్రేమ ఓ ప్రేమష అంటూ సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు సుధాకర్ మారియో సంగీతం సమకూర్చారు. అయితే.. ఈ పాటలో వరలక్ష్మి స్రూల్‌లకు వెళ్లే విద్యార్థినిగా కనిపించి షాక్ ఇచ్చింది.