సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘రాకాస’ సాంగ్ : `ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా

ABN, Publish Date - Mar 13 , 2026 | 09:18 PM

సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించిన చిత్రం  ‘రాకాస’.  మాన‌స శ‌ర్మ‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి  నిహారిక హారిక కొణిదెల‌, ఉమేష్‌కుమార్ బన్సాల్‌ నిర్మాతలు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా  'పదే పదే’ అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.  గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. అనుదీప్ దేవ్ అందించిన బాణీ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్ళాయి.  హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, వారి ప్రేమను చాటేలా పాట సాగింది. మీరు ఈ సాంగ్ పై ఓ లుక్ వేయండి. 

Updated Date - Mar 14 , 2026 | 09:17 AM