Mysaa: విజయశాంతి తరహాలో.. రష్మిక
ABN, Publish Date - Nov 20 , 2026 | 07:39 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మైసా (MYSAA). రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ సైపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మైసా (Mysaa). రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ సైపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ మరో సాంగ్ ని రిలీజ్ చేశారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన ఒసేయ్ .. రాములమ్మ చిత్రంలోని ఓ.. ఒసేయ్ రాములమ్మ సాంగ్ ని రష్మిక కోసం రీమిక్స్ చేశారు. ఈ వీడియో సాంగ్‌లో రష్మిక మందన్న ఇప్పటివరకు ఎన్నడూ చూడని అత్యంత ఉగ్రమైన, మాస్ అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించింది. ఈ సాంగ్ ను మీరు చూసేయండి.