HONEY: ట్రైలర్ ఏంటి ఈరేంజ్‌లో ఉంది! ప్యాంట్లు.. తడుపుకోవడం గ్యారంటీ
ABN, Publish Date - Feb 01 , 2026 | 04:29 PM
నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, దివి, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో తెరకెక్కిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం హనీ.
నవీన్ చంద్ర (NAVEEN CHANDRA), దివ్యా పిళ్లై (DIVYA PILLAI), దివి ( DIVI), రాజా రవీంద్ర కీలక పాత్రల్లో తెరకెక్కిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం హనీ (HONEY T). పలాస, మట్కా సినిమాల ఫేం కరుణ కుమార్ (KARUNA KUMAR) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. గతంలో వచ్చిన పిండం, ఇషా సినిమాలను తలదన్నేలా విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందించినట్లు అర్థమవుతోంది. ఓ అరుదైన పిల్లి కోసం వెతకడం, అది వచ్చాక భయంకర ఘటనలు జరగడం ఇత్యాది సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్ కట్ చేశారు. చూస్తుంటే సినిమాలో మ్యాటర్ గట్టిగానే ఉన్నట్లు స్పష్టంగా అర్తమవుతోంది. మూడనమ్మకాలు నేపథ్యంలో గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.