సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాగ చైత‌న్య 'వృషకర్మ' గ్లింప్స్.. మైండ్‌బ్లోయింగ్‌! ఇది రా.. తెలుగు సినిమా అంటే

ABN, Publish Date - Mar 05 , 2026 | 02:14 PM

యువ సమ్రాట్‌ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా విజనరీ ఫిల్మ్ మేకర్స్ కార్తీక్ దండు (Karthik Dandu) తెరకెక్కిస్తున్న సినిమా 'వృషకర్మ' (Vrushakarma). మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

'వృషకర్మ' చిత్రానికి సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. బి. అజనీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమా నుండి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. దర్శకుడిగా 'విరూపాక్ష'తో తనదైన ముద్రను తెలుగు చిత్రసీమపై వేసిన కార్తీక్ దండు ఇప్పుడీ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సమాయుత్తం చేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.

Updated Date - Mar 05 , 2026 | 03:03 PM