Mr Work From Home: వ్యవసాయం ప్రాముఖ్యత.. మట్టి వాసతో..
ABN, Publish Date - Jan 24 , 2026 | 07:13 PM
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకుడు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా అంధమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన తీరు ఆసక్తిగా ఉంది. ప్రకాశ్ చెరుకూరి అందించిన సంగీతం, బాబా సెహగల్ వారు పాటకు ప్లస్ అయ్యాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతోపాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్‌ఫుల్‌గా సాంగ్‌ను ప్రజెంట్ చేశారు.