Maremma: థ్రిల్లింగ్ అంశాలతో మారెమ్మ ట్రైలర్
ABN, Publish Date - Sep 01 , 2026 | 01:35 PM
మాధవ్ కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ‘మారెమ్మ’ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు,
మాధవ్ కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మారెమ్మ’ (Maremma). దీపా బాలు కథానాయిక. వికాశ్, వినోద్ కుమార్, రూపలక్ష్మి, దయానంద్‌రెడ్డి కీలక పాత్రదారులు. మయూర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేసింది. ‘ఈ భూమ్మీద ఒక జీవి బతకాలంటే మరో జీవి చావాల్సిందే’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. గ్రామ దేవత మారెమ్మ ఇతివృత్తంగా తెలంగాణ పల్లె కథతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే ఆర్థమౌతుంది.