Mahesh: ‘శ్రీనివాస మంగాపురం’ టీమ్‌కు శుభాకాంక్షలు.. మహేశ్ వీడియో వైరల్..
ABN, Publish Date - Jul 26 , 2026 | 02:06 PM
‘శ్రీనివాస మంగాపురం’ టీమ్‌కు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు.
‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) టీమ్‌కు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకెంతో ఇష్టమైన అన్నయ్య రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణకు, దర్శకుడు అజయ్ భూపతికి, చిత్ర సమర్పకుడు సి.అశ్వినీదత్‌కు, ఇతర చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన హీరోగా పరిచయమైన 'రాజకుమారుడు' సినిమా విడుదల రోజే ఈ సినిమా కూడా విడుదల కావడం ఆనందంగా ఉందని మహేష్ బాబు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.