House of Fun: కీర్తి సురేష్ హోమ్‌టూర్
ABN, Publish Date - Jan 23 , 2026 | 05:27 PM
సెలబ్రిటీల ‘హోమ్‌టూర్’ కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ఆయా సెలబ్రిటీల ఇంట్లో విశేషాలు ఏంటి.. ఇంట్లో ప్రత్యేకతలు, అలంకరణలు, అభిరుచులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అభిమానులు, నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే చాలామంది స్టార్స్ హోమ్ టూర్స్ చేశారు. తాజాగా కీర్తి శిరీష్ కొచ్చిలోని తన ఇంటి విశేషాలను హోమ్ టూర్ ద్వారా తెలిపింది. తన భర్త ఆంటోనీ తటిల్‌తో కలిసి ‘హౌస్ ఆఫ్ ఫన్’ (House of Fun) అనే ఇంటి సంగతులు షేర్ చేసుకున్నారు. తన నటనకు సంబంధించిన ఆర్టికల్స్, స్నేహితులు, కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు ఆ ఇంట్లో ప్రత్యేకంగా కనిపించాయి. కీర్తి ఇంటిపై మీరు ఓ లుక్కేయండి..