కేడీ : ది డెవిల్: సంజయ్.. నోరా ఫతేహి ఇరగదీశారు
ABN, Publish Date - Mar 15 , 2026 | 06:08 PM
ధ్రువ్ సర్జా హీరోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘కేడీ : ది డెవిల్’. ప్రేమ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చిత్ర బృందం ప్రొమోషన్స్ షురూ చేసింది. ఈ సందర్భంగా ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ అంటూ సాగే మంచి ఊపునిచ్చే మాస్ బీట్ సాంగ్ విడుదల చేశారు. నోరా ఫతేహీ, సంజయ్ దత్ కాంబోలో రూపొందిన ఈ సాంగ్ యూత్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. అర్జున్ జన్య మాస్ బీట్ కి మంగ్లీ గానం అదనపు ఆకర్షణగా నిలిచింది.