సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

థియేటర్లలో దుమ్మురేపిన ‘ఇరుముడి’ సాంగ్.. వచ్చేసింది

ABN, Publish Date - Aug 31 , 2026 | 01:57 PM

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ 'కట్టు కట్టు ఇరుముడి కట్టు' సాంగ్ .వచ్చేసింది. మీరు లుక్ వేయండి

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం.. యాక్షన్, ఎమోషన్‌తో పాటు పాటలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘కట్టు కట్టు.. ఇరుముడి కట్టు..’ పాటకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.  పాటలోని భక్తి భావం, మాస్ బీట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పలుచోట్ల థియేటర్లలో ప్రేక్షకులు పాటకు అనుగుణంగా భజనలు చేస్తూ సందడి చేశారు. దీంతో ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో చూపించే వీడియోలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ టీమ్ తాజాగా పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ‘కట్టు కట్టు.. ఇరుముడి కట్టు..’ పాట ఇప్పుడు యూట్యూబ్‌లోనూ సందడి చేస్తోంది. పాటలో రవితేజ ఎనర్జీ, విజువల్స్, మాస్ కొరియోగ్రఫీ ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా రూపొందిన ఈ పాట అభిమానులను మరోసారి థియేటర్ల అనుభూతిని కలిగిస్తోంది.  మరి మీరు కూడా ఈ  సాంగ్‌ను చూసేయండి!

Updated Date - Aug 31 , 2026 | 02:12 PM