Nenu Ready: మస్తుగుందిర యవ్వారం అంటున్న కావ్యా థాపర్!
ABN, Publish Date - Aug 13 , 2026 | 05:58 PM
హవీష్ హీరోగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కాంచన కోనేరు నిర్మించిన చిత్రం 'నేను రెడీ'. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది.
యంగ్ హీరో హవీష్‌తో, త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఎంటర్‌టైన్మెంట్ మూవీ 'నేను రెడీ'. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలై, చక్కని ఆదరణ పొందడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమానుంచి మరో లిరికల్ వీడియో విడుదలైంది. 'మస్తుందిర యవ్వారం' అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, మిక్కీ జె మేయర్ స్వర పర్చారు. దీనిని అనురాగ్ కులకర్ణి, మనీషా ఎర్రబత్తిన పాడారు. హీరోహీరోయిన్లు హవీష్, కావ్యాథాపర్ తో పాటు డాన్సర్స్ పై విజయ్ పోలకి కొరియోగ్రఫీలో అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత కాంచన కోనేరు తెలియచేయనున్నారు.