Rapid Chitram: సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Sep 27 , 2026 | 12:10 PM
తెలుగు సినిమా రంగంతో పాటు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన సినీ సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. మరెందుకు ఆలస్యం.. తాజా సినీ అప్డేట్స్ ఏంటో తెలుసుకోండి.
ప్రభాస్ ‘కల్కి సీక్వెల్’ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని రివీల్ చేశారు. ఫస్ట్ పార్ట్‌లో కలవని దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సీక్వెల్‌లో ఒకే స్క్రీన్‌పై సందడి చేయనున్నారట. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘ద ప్యారడైజ్’ చిత్రం విమర్శలు, ట్రోల్స్‌ను పక్కకునెట్టి బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. భారీ వసూళ్ళతో దూసుకెళ్తున్న సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి.. సినిమా వెనుకున్న కష్టాన్ని పంచుకోవడంతో పాటు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
సందీప్ కిషన్, జేసన్ సంజయ్ కాంబోలో రానున్న ‘సిగ్మా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. అక్టోబర్ 2న విడుదలవుతున్న సందర్భంగా మేకర్స్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా జేసన్ సంజయ్ తన తాత, తండ్రిలాగే పరిశ్రమలో గొప్ప స్థాయికి వెళ్ళాలని చిరు ఆకాంక్షించారు. శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా మంగా శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ‘చకోర’ ట్రైలర్‌ను ఆకాశ్ జగన్నాథ్ విడుదల చేశారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకోవాలని చిత్రబృందానికి విషెస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
దర్శకుడు ప్రదీప్ అద్వైతంకు భార్యావియోగం
మోహన్ బాబు చాలా స్ట్రిక్ట్ అనుకుంటారు కానీ.. అంత లేదు: నాని
Mohan Babu: నాని నువ్వు గొప్ప నటుడివి.. నూరేళ్లు చల్లగా ఉండాలి
Updated at - Sep 27 , 2026 | 12:10 PM