Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక

ABN, Publish Date - Oct 04 , 2026 | 04:49 PM

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న RC17 చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 20న పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారట. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపి.. 12 నెలల్లో సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది చివరలో విడుదల చేసేలా సుక్కూ ప్లాన్ చేస్తున్నారట. శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్ దగ్గర లగ్జరీ విల్లా కొన్న విజయ్ దేవరకొండ, రశ్మిక జంట త్వరలో కొత్త ఇంటికి మారబోతున్నారట. మరోవైపు ఈ క్రేజీ కపుల్ నటించిన ‘రణబాలి’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ద మెన్ వి ఫర్గాట్’ అనే మూడో డాక్యుమెంటరీ ఎపిసోడ్‌ను విడుదల చేశారు మేకర్స్. నంది అవార్డులలో మార్పులు చేర్పులు జరిగాయి. 2017 నుంచి 2024 వరకూ కేవలం రెండు చిత్రాలకు కాకుండా మూడు చిత్రాలకు నంది అవార్డులు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అలానే ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డులనూ ఆ యా సంవత్సరాలకు ప్రకటించబోతోంది. తమ వినతిని పరిగణనలోకి తీసుకున్న సర్కారుకు నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

మరో విభిన్నమైన కథతో సిద్ధమైన ‘ది రెడ్ బ్యాగ్’ దర్శకుడు

Peddi Movie: దసరా బరిలో ‘పెద్ది’ కూడా..

ఆ సినిమా నాకిచ్చిన దైవవరం.. సినీ శ్వాస సింగీతం: ‘ఆదిత్య 369’ నిర్మాత

Updated at - Oct 04 , 2026 | 04:49 PM