Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Aug 14 , 2026 | 12:44 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

సూపర్ స్టార్ రజనీకాంత్, అశ్వత్ మారిముత్తు కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ధర్మన్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ఒక స్పెషల్ వీడియో ద్వారా పంచుకున్నారు. శర్వానంద్-శ్రీను వైట్ల కాంబోలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న కొత్త చిత్రం శుక్రవారం షురూ కానుంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీకి సైన్స్ టచ్ ఇస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సిగ్మా’ నుంచి ‘ఓలమ్మో వగలాడి’ సాంగ్‌ విడుదలైంది. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ పాడారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కాపీరైట్ వివాదంలో నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కథ తనదేనంటూ రచయిత్రి శ్యామల రాణి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.. ఇంకా ఇలాంటి సినిమా విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ ‘లెనిన్’

అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం: ఉప్పల్ బాలు

స్టేజ్‌పైనే డైరెక్టర్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పిన హీరోయిన్.. అంతా షాక్

Updated at - Aug 14 , 2026 | 12:44 PM