Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక
ABN, Publish Date - Aug 26 , 2026 | 10:03 AM
వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తోన్న ‘మహాకాళి’ నుంచి గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది. ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం నుంచి ‘న్యాయం చేయరా దేవుడా’ అంటూ సాగే పాటను ఆస్కార్ విజేత, రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఆహా ‘టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్’ విన్నర్‌గా గౌతమ్ సెలెక్ట్ అయ్యారు. అనిరుధ్, ప్రవీణ రన్నరప్‌లుగా నిలిచారు. 8 ఎపిసోడ్ల ఈ షో ఫైనల్‌కు తరుణ్ భాస్కర్ స్పెషల్ జడ్జ్‌గా రాగా.. లైవ్ ఆడియన్స్ ఓటింగ్‌తో విజేతను ఎంపిక చేశారు. ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండిక.