సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక

ABN, Publish Date - Jul 29 , 2026 | 11:09 AM

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.

‘ఆదర్శ కుటుంబం’ నుంచి స్వర్ణ గ్లింప్స్ విడుదలైంది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ, వెంకటేశ్ టైమింగ్‌తో కూడిన ఈ వీడియో ఆకట్టుకుంది. స్వర్ణ క్యారెక్టర్‌తో పాటు నివేదా పేతురాజ్ కూడా హైలైట్‌గా నిలిచింది. ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్‌లో అక్కినేని నాగచైతన్య సందడి చేశారు. తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచిన చైతూకు మేకర్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను పంచుకున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపుదిద్దుకుంటోన్న ‘ద ప్యారడైజ్’లో కీర్తిసురేశ్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్ల మధ్య ఈ పాట చిత్రీకరిస్తున్నారట.

దర్శకుడు అజయ్ భూపతితో కలసి ఘట్టమనేని జయకృష్ణ.. మహేశ్ బాబును కలసి ఆశీస్సులు అందుకున్నాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకోవడంతో పాటు జయకృష్ణ డెబ్యూ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు మహేశ్. నితిశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణ’ ట్రైలర్‌ను ఈ నెల 30న డిజిటల్ వేదికగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు త్వరలో పట్టాలెక్కనున్న ‘ధూమ్ 4’ నుంచి రణ్‌బీర్ కపూర్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

చిత్ర పరిశ్రమ నాకు నేర్పింది ఇదే: శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

నేడు నటి పావలా శ్యామల అంత్యక్రియలు

Naga Chaitanya: ప్రేమకథలు తగ్గిపోయాయని బాధపడ్డా..

Updated Date - Jul 29 , 2026 | 11:09 AM