Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Aug 23 , 2026 | 04:14 PM
సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!
‘స్పిరిట్’లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ట్యాగ్‌పై ప్రభాస్ ‘మీ ఇష్టం డార్లింగ్’ అని క్యాజువల్‌గా చెప్పారని నిర్మాత ప్రణయ్ రెడ్డి తెలిపారు. ట్యాగ్స్ పట్టించుకోకుండా మేకర్స్‌ను నమ్మడమే ఆయన సింపుల్ పర్సనాలిటీకి నిదర్శనమన్నారు. అక్కినేని అఖిల్ తన తదుపరి సినిమాల కోసం గేర్ మార్చి సరికొత్త రగ్డ్ లుక్‌లోకి మారారు. గుబురు గడ్డం, హెయిర్ స్టైల్, చెవికి పోగుతో ఉన్న అయ్యగారి పిక్ వైరల్‌గా మారింది. అయితే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ బోయపాటితో చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహావీర్ కర్ణ’ టీజర్ విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా ‘హైబ్రిడ్ లైవ్-యాక్షన్’ సాంకేతికతతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. అన్ష్, వాసవి గణేశ్ నటించిన ‘హుషారు పిట్టలు’ సినిమా చిత్రబృందం సక్సెస్ సంబరాల్లో మునిగిపోయింది. మంచి కంటెంట్ ఉంటే పెద్ద హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించిందని మేకర్స్ హర్షం వ్యక్తం చేశారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ విధ్వంసం.. 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే
Biopic Boom: బయోపిక్‌ల హవా.. తెరపైకి వస్తున్న సంచలన జీవితగాథలు!
జాంబీ రెడ్డి 2.. ఈ రేంజ్ లెవెల్ ఊహించలేదయ్యా వర్మా