Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Sep 04 , 2026 | 01:17 PM
సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!
కమల్ హాసన్, ‘చిత్తా’ ఫేమ్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కమల్ సరికొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి సీక్వెల్ ఖరారైంది. ‘ఐ యామ్ గేమ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న దుల్కర్, వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పనులను ప్రారంభించనున్నారు డైరెక్టర్ వెంకీ. అల్లరి నరేశ్ నటించిన ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలవుతుండటంతో.. చిత్ర విజయంపై మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.. ఇంకా ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
అల్లు అరవింద్ వర్సెస్ యశ్ మదర్ కాంట్రవర్సీ.. వర్మ పోస్ట్ వైరల్
నేపాల్‌కు ‘చేయూతనివ్వండి’.. రంగంలోకి రియల్ హీరో
ట్విన్స్‌తో జన్మాష్టమి.. ఉపాసన షేర్ చేసిన పిక్ వైరల్