Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక

ABN, Publish Date - Aug 05 , 2026 | 01:24 PM

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.

‘దూకుడు 4K’ రీ-రిలీజ్‌ ట్రైలర్‌ విడుదలైంది. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ మహేశ్ బాబు బర్త్‌డే కానుకగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానుంది. ‘మైసా’ సెట్స్‌లో గాయపడిన రశ్మిక.. డాక్టర్ల సూచనతో బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. అయితే ఈ విరామం దేవుడిచ్చిన బ్రేక్‌గా ఆమె వ్యాఖ్యానించింది. అజిత్ 64వ సినిమాకు ‘డేర్ డెవిల్’ టైటిల్ ఖరారైంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో షాలిని నిర్మిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కనుంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న ‘ద ప్యారడైజ్’ టీజర్‌కు డేట్ లాకైంది. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ టీజర్‌ ఆగస్ట్ 6న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మంచు మనోజ్ ‘వడ్డీ కాసులవాడా’ సినిమాలో జయం రవి కీ రోల్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. తేజ్ ఉప్పలపాటి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామిగా జయం రవి కనిపించనున్నారట. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘ద రెడ్ బ్యాగ్’ నుంచి ‘నీ వెనకే’ అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడగా.. శేఖర్ మోపురి సంగీతం అందించారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

‘రాంబాయి’ కూడా ఫీల్డ్‌లోకి దిగిందిగా!

‘రామాయణ’ డిజైన్ దుస్తుల కాంట్రవర్సీపై డిజైనర్స్ ఫైర్

‘పెద్ది’లోకి స్పైడర్ మ్యాన్.. ఇదెక్కడి వాడకం రా అయ్యా!

Updated at - Aug 05 , 2026 | 01:24 PM