‘పెద్ది’లోకి స్పైడర్ మ్యాన్.. ఇదెక్కడి వాడకం రా అయ్యా!

ABN , Publish Date - Aug 04 , 2026 | 09:07 PM

ఇటీవల హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ఇండియాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Peddi Spider-Man memes

ఇటీవల హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ఇండియాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే టైమ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్లు, నెటిజన్లు ఓ రేంజ్‌లో తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఈ హాలీవుడ్ సూపర్‌హీరోని, అందులో నటించిన నటీమణులను సైతం మన లోకల్ మాస్ ట్రాక్‌లలోకి తెచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చి సెన్సేషనల్ సక్సెస్‌ని అందుకున్న ‘పెద్ది’ (Peddi) మాస్ అట్మాస్ఫియర్‌లోకి ఏకంగా స్పైడర్ మ్యాన్‌నే దింపేశారు.


ఏఐ టెక్నాలజీని విపరీతంగా వాడేస్తూ నెటిజన్లు క్రియేట్ చేసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్, ఆయన ప్రేయసి జెండయా, మరో నటి సాడీ సింక్‌లను పక్కా గ్రామీణ వాతావరణంలో, ‘పెద్ది’ సినిమాలోని ఊరమాస్ గెటప్‌లలోకి మార్చేశారు. స్పైడర్ మ్యాన్‌ అండ్ టీమ్‌ను ‘పెద్ది’ సినిమాలోని హెల్లల్లో పాటలో చరణ్, జాన్వీ, శృతి ఫేస్‌లలోకి తెచ్చేశారు. జెండయా, సాడీ సింక్‌లను సాంప్రదాయ లంగా ఓణీలు, ఘాగ్రాలలో తీర్చిదిద్ది ఆ మాస్ పాటలో డాన్స్ చేస్తున్నట్లు ఏఐ ద్వారా క్రియేట్ చేసిన పిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


హాలీవుడ్ సూపర్‌హీరో ‘పెద్ది’ ప్రపంచంలోకి వచ్చి ఈ రేంజ్‌లో రచ్చ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘ఇదెక్కడి వాడకం రా అయ్యా.. హాలీవుడ్ హీరోకి కూడా పక్కా నాటు మాస్ ఫ్లేవర్ అంటించేశారుగా!’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా టాలీవుడ్‌లోని ఇతర హీరోల సీన్లకు సింక్ చేస్తూ.. స్పైడర్ మ్యాన్‌‌ను నెటిజన్లకు చూపిస్తున్నారు. ఈ వీడియోలన్ని సినిమాలపై మరింతగా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఒకవైపు ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తుంటే, మరోవైపు ఈ ఇండియన్ మాస్ అవతార్ మీమ్స్, ఫొటోలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేల సంఖ్యలో షేర్లు అవుతూ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి!

ఇవి కూడా చదవండి:

‘ఓజీ-2’ కన్నా ముందే ‘బ్లడీ రోమియో’.. సుజిత్ మెగా ట్విస్ట్

‘చింటూ’ వెనుక కథేంటని అడిగిన యాంకర్‌కు నాగవంశీ క్రేజీ ఆన్సర్!

ఆ సెంటిమెంట్ రిపీట్! రవితేజ కంబ్యాక్ ఖాయమా?

Updated Date - Aug 04 , 2026 | 10:31 PM