సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Aug 13 , 2026 | 04:18 PM

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!

ఎన్టీఆర్‌ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. తారక్ ఆరోగ్యంగా ఉన్నారని, రెండు మూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆగస్ట్ 14న విడుదల కానున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేదికపై హీరో సూర్య మాట్లాడుతుండగా.. దర్శకుడు వెంకీ అట్లూరి ఆయన కాళ్ళకు నమస్కరించి సర్‌ప్రైజ్ చేసి, తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సినిమాతో ‘గజిని’ నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని సూర్య ధీమా వ్యక్తం చేశారు. రవితేజ, శివ నిర్వాణ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్‌ను భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మేకర్స్ విడుదల చేశారు. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. యూట్యూబ్ స్టార్ మౌళితో శ్రీను కంబాల తెరకెక్కిస్తోన్న ‘దొంగనా కొడుకు’ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి చదవండి:

కృష్ణ కొడుకుతో సినిమా తీసినా.. ఎన్టీఆర్‌ని ఏమైనా అంటే నేనే కొడతా: MS రాజు

బాక్సాఫీస్‌ పోరులో ‘సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు?

రౌడీ వేర్ బ్రాండ్‌కు ఫ్యాన్స్‌గా డైరెక్టర్స్.. విజయ్ క్రేజ్ ఇది!

Updated Date - Aug 13 , 2026 | 04:38 PM