Rapid Chitram: సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Sep 19 , 2026 | 12:26 PM
తెలుగు సినిమా రంగంతో పాటు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన సినీ సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. మరెందుకు ఆలస్యం.. తాజా సినీ అప్డేట్స్ ఏంటో తెలుసుకోండి.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న ‘ద ప్యారడైజ్’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించిన మేకర్స్, తాజాగా బెంగళూరు మీడియా సమావేశంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశారు. ఇక ఈ నెల 21న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘వెట్టువం’. మూడు వేర్వేరు కాలాల్లో సాగే పోరాట నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నుంచి ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పాత్రల పరిచయంతో పాటు భారీ సెట్లు, రా అండ్ రస్టిక్ విజువల్స్, యాక్షన్ సీన్స్‌తో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది.
సూర్య, జీతూ మాధవన్ కాంబోలో రానున్న ‘సీన్’ తెలుగు టీజర్ విడుదలైంది. ఇందులో సూర్య డీఎస్పీ 'ప్రేమ్ రాజ్'గా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 6న దీపావళికి విడుదల చేయనున్నారు. శ్రీ నందు హీరోగా, నారా ప్రవీణ్ దర్శకత్వంలో వస్తున్న సెటైరికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మగాళ్ళు జిందాబాద్’. మగవారి కష్టాలు, కుటుంబ బాధ్యతలను వినోదాత్మకంగా చూపిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి
యాక్షన్, హర్రర్ చిత్రాలకు ఏమాత్రం తేడా లేదు: దర్శకుడు
‘వారణాసి’ కోసం రంగంలోకి నార్వే వీఎఫ్ఎక్స్ దిగ్గజం.. జక్కన్నా, నీకో దండం సామి!
Updated at - Sep 19 , 2026 | 12:26 PM