Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:28 PM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
అనీశ్, అనశ్వర రాజన్ జంటగా మహేశ్ ఉప్పాల తెరకెక్కిస్తోన్న ‘ఇట్లు అర్జున’ టీజర్ విడుదలైంది. తొలి చిత్రంలోనే హీరో అనీశ్ మూగ పాత్ర చేయడం ఛాలెంజింగ్ విషయమన్న మేకర్స్.. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే పక్కా కమర్షియల్ ఎమోషనల్ డ్రామా అని ధీమా వ్యక్తం చేశారు. ‘హ్యాపీ జర్నీ’ మూవీ విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మేకర్స్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. స్క్రిప్ట్‌పై నమ్మకంతో ఏడుగురు నటీమణులు కష్టపడి చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
సందీప్ కిషన్, జేసన్ సంజయ్ కాంబోలో వస్తోన్న ‘సిగ్మా’ సినిమా ట్రైలర్ విడుదలైంది. క్యాసినో మాఫియా, డ్రగ్స్, దోపిడీ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్, వరుసగా పాత్రలను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా మలయాళ స్టార్ సూరజ్ వెంజరమూడు ‘దిలీప్’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు క్యారెక్టర్ ప్రోమో విడుదల చేశారు. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
చిరు లీక్స్: ‘కాకా’ క్యారెక్టర్ పేరు లీక్.. ఎంత పని చేశావ్ స్రవంతి?
ట్రోలర్లకు వార్నింగ్.. బిగ్‌బాస్‌లో షర్ట్ విప్పి సల్మాన్ రచ్చ
ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం విజయ్ అన్నే: అట్లీ