సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Aug 29 , 2026 | 12:43 PM

తెలుగు సినిమా రంగంతో పాటు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన సినీ సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. మరెందుకు ఆలస్యం.. తాజా సినీ అప్డేట్స్ ఏంటో తెలుసుకోండి.

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ 10వ సీజన్ సైరన్ మోగనుంది. నాగార్జున హోస్ట్‌గా సెప్టెంబర్ 6 నుంచి షో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ మైల్‌స్టోన్ సీజన్‌లో యంగ్ హీరో అదిత్ అరుణ్‌తో పాటు కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, నరేశ్ పాల్గొనబోతున్నట్లు వినికిడి. సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రశ్మిక నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, బన్నీ వాస్, రాక్‌లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 16న ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది. సుమంత్, సంతోష్ జాగర్లపూడి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘మహేంద్రగిరి వారాహి’ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం సెప్టెంబర్‌ 11న విడుదలకానుంది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘రేస్ 4’లో ఆమిర్ నటించనున్నారట. ‘ధూమ్ 3’ తర్వాత దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యతో కలసి ఈ సినిమా చేయబోతున్నారట. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఆమిర్ ఓకే చెప్పారని టాక్... ఇంకా ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

‘తలైవర్‌’తో సెల్ఫీ.. నమ్మలేని నిజం: కయాదు లోహర్‌

‘King100’ గ్లింప్స్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా

Nayantara: మనిషి మారినా దక్కని విజయం!

Updated Date - Aug 29 , 2026 | 12:43 PM