దాసరి ఘాట్‌ని పునరుద్ధరించిన ‘రా కింగ్’ మనోజ్.. వీడియో వైరల్!
ABN, Publish Date - May 30 , 2026 | 04:04 PM
దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలు వచ్చిన కొన్ని గంటల్లో ‘రా కింగ్’ మనోజ్ మంచు స్పందించి.. స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు.
దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఘాట్ (Dasari Ghat) దుస్థితిపై సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలు వచ్చిన కొన్ని గంటల్లో ‘రా కింగ్’ మనోజ్ (Raw King Manchu Manoj) మంచు స్పందించి.. స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని మనోజ్ మంచు ఇలా చాటుకున్నారు. దాసరి ఘాట్‌ని మంచు మనోజ్ పునరుద్ధరిస్తోన్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా మనోజ్ మంచు స్పందిస్తూ.. దాసరి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. తరతరాలకు స్ఫూర్తినిచ్చి, తెలుగు సినిమాకు ఎంతో విశిష్టతను చేకూర్చిన దాసరి ఘాట్‌కు ఇలాంటి పరిస్థితా? ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చిన వారికి ధన్యవాదాలు. నా వంతుగా నేను చేయగలిగి సహాయం చేస్తానని హామీ ఇస్తున్నానని ట్వీట్ వేశారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మనోజ్ తన సినిమా షూటింగ్‌కి వెళ్లే కంటే ముందు ఉదయం 7 గంటలకు.. తన బృంద సభ్యులతో కలిసి దాసరి ఘాట్ వద్దకు చేరుకున్నారు. ‘‘మూడు, నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్ని చూసి చాలా బాధగా ఉంది. చిత్రపురి కాలనీ దాటుతుండగా, ఆయన విగ్రహం కనిపించి ఘాట్ గుర్తొచ్చింది. ఆ వీడియా మా టీమ్ నాకు చూపించడంతో అసలు విషయం తెలిసింది. ఆ దృశ్యాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నేను తట్టుకోలేకపోయాను. అందుకే దీనికి ప్రాధాన్యతనిచ్చి, నా షూటింగ్‌కు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చాను’’ అని మనోజ్ తెలిపారు. ఆ తర్వాత మనోజ్ తన టీంతో కలిసి ఘాట్ చుట్టూ పేరుకుపోయిన ఎండుటాకులు, చెత్తను తొలగిస్తూ ఘాట్ ప్రాంతమంతటినీ శుభ్రం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇదే..
ఇవి కూడా చదవండి:
మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!
NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?
Updated at - May 30 , 2026 | 04:08 PM