Comrade Kalyan: పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఎత్తర ఎత్తు ఎర్రజెండా..
ABN, Publish Date - Sep 29 , 2026 | 05:41 PM
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘కామ్రేడ్ కల్యాణ్’ చిత్రం నుంచి ‘ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు.. ఎత్తర ఎత్తు ఎర్రజెండా ఎత్తు..’ అంటూ సాగే ఆవేశపూరితమైన పాటను చిత్ర బృందం విడుదల చేసింది.
విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు ఇప్పుడు ‘కామ్రేడ్ కల్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు.. ఎత్తర ఎత్తు ఎర్రజెండా ఎత్తు..’ అంటూ సాగే ఆవేశపూరితమైన పాటను చిత్ర బృందం విడుదల చేసింది. విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన ఈ గీతానికి ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. నల్గొండ గద్దర్ నర్సన్న తనదైన ఆవేశభరితమైన గాత్రంతో ఈ పాటను ఆలపించారు. పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాగుతున్న ఈ పాటలోని పదాలు, బాణీ, గాయకుడి గంభీరమైన వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.