Arjun Sarja: సీతా పయనం' నుండి.. ధ్రువ సర్జా 'బసవన్న' పాట
ABN, Publish Date - Jan 15 , 2026 | 05:08 PM
మల్టీ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'సీతా పయనం'. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతున్నారు. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. అయితే యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన ‘బసవన్న’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన బాణీకి తగ్గట్టుగా కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. దీన్ని నకాస్ అజిజ్, ఎల్. కీర్తన వినసొంపుగా పాడారు. ఈ పాటకు లలితా శోభి, శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటున్న 'సీతా పయనం' ఫిబ్రవరి 14న పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కాబోతోంది.