Sri Vishnu: దేఖో విష్ణు విన్యాసం...
ABN, Publish Date - Jan 09 , 2026 | 09:53 AM
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం' ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నాడు. సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు. ఫిబ్రవరిలో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ 'దేఖో విష్ణు విన్యాసం...' విడుదలైంది. ఈ సరదా పాట కథానాయకుడికి జ్యోతిష్యంపై ఉన్న పిచ్చిని ప్రజెంట్ చేస్తోంది. రధన్ అందించిన మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి చమత్కారమైన సాహిత్యం, శ్రీకృష్ణ పవర్ ఫుల్ వోకల్స్ ఈ పాటను మూఢనమ్మకాలపై ఒక సరదా వేడుకగా మార్చాయి. నయన సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.