భావోద్వేగంగా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్
ABN, Publish Date - Feb 19 , 2026 | 11:01 AM
కూతురు కనిపించకపోతే ఒక తండ్రి ఏం చేస్తాడు?.. ఆమెని కాపాడటానికి అతను ఎంత దూరం వెళ్తాడు? కూతురిపై పంచ ప్రాణాలు పెట్టుకున్న ఓ తండ్రి కథేంటో తెలుసుకోవాలంటే ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న క్రైమ్, థ్రిల్లర్ ఇది. కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఆరు ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా’ అని రాజీవ్ కనకాల చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి.
Updated at - Feb 19 , 2026 | 02:30 PM