Bobby Kolli: చిరంజీవికీ నచ్చిన హీరో ఎవరో తెలుసా.. దర్శకుడి క్లారిటీ
ABN, Publish Date - Jan 31 , 2026 | 09:51 AM
సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో పాటు విడుదలై విజయం సాధించింది 'అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఏ సందర్భంగా దర్శకుడు బాబీ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. 'ఈ మధ్యనే చిరంజీవి గారితో మాట్లాడాను. ‘అనగనగా ఒక రాజు' సినిమాలో నవీన్ ఎంత ఎనర్జిటిక్‌గా చేశాడో.. ఈ జనరేషన్‌లో నాకు నచ్చిన హీరో అతడు' అని అన్నయ్య నాతో అన్నారు' అని బాబీ తెలిపారు. ఆయన సినిమా విజయంతో పాటు నవీన్ హిట్‌ను కూడా చిరు ఆస్వాదించారని ఆయన అన్నారు.