డెకాయిట్‌:  'చిచ్చుబుడ్డి' సాంగ్.. సింగర్ జోనితా టాప్ లేపేసింది 

ABN, Publish Date - Mar 28 , 2026 | 07:58 PM

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం  'డెకాయిట్‌'. పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకుడు. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. శనివారం మేకర్స్ ఈ సినిమా నుంచి 'చిచ్చుబుడ్డి' అంటూ సాగే సెకండ్ సింగిల్ సాంగ్ ను విడుదల చేసారు. భీమ్స్ సంగీతంలో ఈ పాటను రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. అంతే కాదు అడివి శేష్ సరసన సింగర్  జోనితా గాంధీ ఆడిపాడారు. భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ప్రత్యేక పాత్రలో కనిపించి, అందరినీ కట్టుకునే మాస్ వైబ్‌ను నింపారు. గాయనిగా పాపులర్ అయినా జోనితా గాంధీ తెలుగులో ఓ సాంగ్ లో నటించడం ఇదే మొదటిసారి. ఈ సాంగ్ ను మీరు చూసేయండి.  

Updated at - Mar 28 , 2026 | 08:13 PM