చరణ్ అర్జున్.. 'లింగో లింగో' శివరాత్రి పాట
ABN, Publish Date - Feb 16 , 2026 | 12:57 PM
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యే పాటలు అనేకం యూట్యూబ్‌లో విడుదలయ్యాయి.
శివరాత్రి (maha shivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యే పాటలు అనేకం యూట్యూబ్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ సింగర్స్ అంతా వారి వారి శైలిల్లో పాటలు రూపొందించి విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత చరణ్ అర్జున్ (Charan Arjun) సైతం స్వయంగా రచించి, నిర్మించి, సంగీతం అందించిన లింగో, లింగో (Lingo Lingo Song) అంటూ ఆగే పాటను ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదల చేశారు.
గాయని వీహా (Veeha) ఈ పాటను ఆలపించడమే గాక లీడ్ పాత్రలో నటించింది. ఇప్పటివరకు వచ్చిన పాటలకు భిన్నంగా కొత్త పదాలు, నృత్య రీతులతో గీతం ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. మీరూ ఈ పాటను ఒకమారు వీక్షించండి.