Buchibabu Sana: రవిగారు.. ఈవెంట్ కి పదివేలు ఇవ్వండి..ప్లీజ్

ABN, Publish Date - Nov 12 , 2026 | 10:28 AM

ఇటీవల హైద్రాబాద్ఈ లో జరిగిన ‘డీఎన్‌కే’ (దొంగ నా కొడుకు) ప్రీరిలీజ్‌ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు తనదైన శైలిలో నిర్మాత రవిశంకర్‌పై సరదా వ్యాఖ్యలు చేశారు.

''మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్వహించే ప్రతి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు నన్ను పిలుస్తున్నారు. రవిగారు తిడతారనో, కొడతారనో.. తప్పకుండా వస్తున్నా. ఇలా ఒక్కో ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా.. ఈపాటికి కోకాపేటలో ఓ ఫ్లాట్‌ కొనుక్కునేవాడిని. ఇక నుంచి అయినా ఇస్తారని నమ్ముతున్నా’’ అంటూ బుచ్చిబాబు(buchibabu sana) సరదాగా వ్యాఖ్యానించారు.

మౌళి తనూజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డీఎన్‌కే’. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించింది. నవంబర్‌ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు తనదైన శైలిలో నిర్మాత రవిశంకర్‌పై సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలకు వేడుకకు హాజరైన వారంతా సరదాగా నవ్వుకున్నారు.

ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!

Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?

Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..

Jyothika: మా పరిధిని మరింతగా విస్తరించే ధైర్యాన్ని ఇచ్చారు




Updated at - Nov 12 , 2026 | 11:06 AM