Bhagavanthudu: తిరువీర్ సినిమా నుంచి సెకండ్ సింగిల్
ABN, Publish Date - Jul 27 , 2026 | 12:13 PM
తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'భగవంతుడు' మూవీ నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. దీనిని దర్శకుడు జీజీ విహారి రాయగా, ఎస్. కృష్ణ ప్రసాద్ స్వరపరిచారు.
తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'భగవంతుడు'. జి.జి. విహారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవికుమార్ పనస నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందులో భాగంగా సోమవారం ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'సితరాల నవ్వు... చిలకల్లే నువ్వు... సేమంతి పువ్వు అంగనా..' అంటూ సాగే ఈ గీతాన్ని దర్శకుడు జీజీ విహారి రాయగా, జావేద్ అలీ పాడారు. ఎస్. కృష్ణప్రసాద్ దీనికి స్వరాలు అందించారు. ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో తిరువీర్, ఫరియా అబ్దుల్లా ఇద్దరూ మేకప్ లేకుండా నేచురల్ గా కనిపించడం విశేషం. రుషి నాగరాజు, కాలకేయ ప్రభాకర్, రవీంద్ర విజయ్, మహేందర్ గౌడ్, షెల్లీ, విజయ్ వర్మ, చిరాగ్ జానీ, బలగం సంజయ్, అదిరే అభి, మైమ్ మధు, జబర్దస్త్ జీవన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.