సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunny Deol: విడుదలైన 'బట్వారా 1947' టీజర్

ABN, Publish Date - Jun 18 , 2026 | 05:06 PM

దేశ విభజన విషాదగాథను ప్రముఖ దర్శకుడు రాజ్‌ కుమార్‌ సంతోషి 'బట్వారా 1945' పేరుతో తెరకెక్కించారు. ఈ పిరియడ్‌ డ్రామాలో సన్నీ డియోల్‌, ప్రీతి జింటా, షబానా ఆజ్మీ, అలీ ఫజల్‌, అభిమన్యు సింగ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్‌ చేశారు.

'బట్వారా 1947' సినిమా అస్గర్ వజాహత్‌ రాసిన నాటకం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా. మొదటి దీనికి 'లాహోర్‌ 1947' అనే పేరు పెట్టారు. అయితే ఆ తర్వాత 'బట్వారా 1947'గా మార్చారు. ఈ చిత్రానికి సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ సమకూర్చగా, ఎ. ఆర్. రెహమాన్‌ సంగీతం అందించారు. సాహిత్యాన్ని జావేద్ అక్తర్‌ రచించారు. ఈ సినిమాను ఆమిర్‌ ఖాన్, అపర్ణ పురోహిత్‌ నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!

వెంకటేష్, విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు.. ఆ లీగ్ జరుగుతుందా?

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

Updated Date - Jun 18 , 2026 | 05:09 PM