సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆవారాపన్ -2 నుంచి గుండెలు పిండేసే పాట!

ABN, Publish Date - Jul 21 , 2026 | 05:47 PM

ఇమ్రాన్ హష్మీ ఆవారాపన్ 2 సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అరిజిత్‌ సింగ్‌ పాడిన టైటిల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఇమ్రాన్ హష్మీ, దిశా పటానీ నటించిన 'ఆవారాపన్ 2' చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం అరిజిత్ సింగ్‌ పాడిన 'యే ఆవారాపన్' అనే విషాదగీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను అమాల్ మాలిక్ స్వరపరిచాడు. ఒంటరితనం తాలూకూ బాధను ఇమ్రాన్ హష్మీ అద్భుతంగా ఈ వీడియో సాంగ్ లో చూపించాడు. మూడు నిమిషాల పాటు సాగిన ఈ పాట ఆ పాత్రలోని డెప్త్ ను, విరహాన్ని తెలియచేసే విధంగా ఉంది. షబానా ఆజ్మీ, సువీందర్ విక్కీ, విజయంత్ కొహ్లీ, అతుల్ కుమార్, అనిరుధ్‌ రావల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను నితిన్ కక్కర్ డైరెక్ట్ చేశారు. 2007లో వచ్చిన 'ఆవారాపన్' చిత్రానికి ఇది సీక్వెల్.

Updated Date - Jul 21 , 2026 | 05:47 PM