‘అనకాపల్లి’.. దుమ్ములేపే మాస్ నంబర్.. చూశారా!

ABN, Publish Date - May 08 , 2026 | 06:23 PM

భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమా నుంచి ‘లబ్బరు బొమ్మ’ అనే మాస్ నెంబర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ పాత్రను కూడా ఇందులో పోషించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ అదిరిపోయే మాస్ సాంగ్‌ని విడుదల చేశారు.

‘లబ్బరు బొమ్మ’ (Labbaru Bomma) అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. ఇందులో తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) స్టెప్పులు, నందినీ రాయ్ (Nandini Rai) అందాలు ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. ఈ పాటకు రాంబాబు గోశాల అందించిన సాహిత్యం ఫన్నీగా ఉండగా.. దేవ్ జాంద్ ఇచ్చిన ట్యూన్ ఆకట్టుకునేలా ఉంది. శ్రీకృష్ణ, సాహితీ చాగంటి ఈ పాటను ఆలపించగా.. యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చింది.


ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా విడుదలైన ‘అమ్మోరు దిగినాది’ అనే పాట యూట్యూబ్‌లో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా వచ్చిన ఈ ‘లబ్బరు బొమ్మ’ కూడా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. మాస్ ఆడియెన్స్‌కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్, యూత్‌ మెచ్చే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

Updated at - May 08 , 2026 | 06:23 PM