సునీల్ చేతుల మీదుగా 'అదే నీవు అదే నేను' ట్రైలర్
ABN, Publish Date - Jul 27 , 2026 | 01:29 PM
'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో గుర్తింపు పొందిన త్రినాథ్ వర్మ కథానాయకుడిగా తెరకెక్కిన అదే నీవు అదే నేను' చిత్రం ట్రైలర్ ను నటుడు సునీల్ ఆవిష్కరించారు
'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో గుర్తింపు పొందిన త్రినాథ్ వర్మ(Trinath Varma), యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం 'అదే నీవు అదే నేను' (Adhe Neevu Adhe Nenu). కొండల్ దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మించారు. ఈ నెల 31న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను సునీల్ విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సునీల్ మాట్లాడుతూ 'అదే నీవు అదే నేను' ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో థ్రిల్, సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొత్త టాలెంట్‌తో వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ప్రోత్సహించండి' అని అన్నారు.
ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సమాజంలో జరిగే కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ కథను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కనిష్క సంగీతం అందించగా, నిమ్మల జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.