Polimera 3: యాక్షన్ టచ్.. అర్జున్ పాత్రపై ఆసక్తి పెంచిన మేకర్స్!
ABN, Publish Date - Jul 27 , 2026 | 11:03 AM
పొలిమేర 3 చిత్రం షూటింగ్లో యాక్షన్ కింగ్ అర్జున్ అర్జున్ అడుగుపెట్టారు. ఇందులో ఆయన ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు.
‘పొలిమేర’,‘పొలిమేర 2’ సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగా అలరించాయి తెలిసిందే. ఈ సిరీస్ సినిమాలతో సత్యం రాజేశ్‌కు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడీ ఫ్రాంఛైజీలో ‘పొలిమేర 3’ (Polimera 3) కూడా రానుంది. అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి కీలక పాత్రధారులు. యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడీ సినిమాలో భాగమయ్యారు. ఇందులో ఆయన పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఆయన్ను సెట్లోకి ఆహ్వానిస్తూ ‘యాక్షన్ మీట్స్ పవర్’ అంటూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. దీనిని మీరు చూసేయండి...