సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఒక్క ఈవెంట్‌తో హాట్‌ టాపిక్‌ అయిన జైన్‌ ఖాన్‌..

ABN, Publish Date - Apr 06 , 2026 | 11:55 AM

సోషల్ మీడియా యుగంలో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోవడం అంటే అంత సులభం కాదు. కానీ కొందరికి అదృష్టం అలా నడిచి వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో రెండు రోజులుగా ఒక పేరు మార్మోగిపోతోంది.

సోషల్ మీడియా యుగంలో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోవడం అంటే అంత సులభం కాదు. కానీ కొందరికి అదృష్టం అలా నడిచి వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో రెండు రోజులుగా ఒక పేరు మార్మోగిపోతోంది. ఆ పేరే.. జైన్ మేరీ ఖాన్ (Zayn Marie Khan). కేవలం ఒకే ఒక్క ఈవెంట్.. ఒక్క అవుట్‌ఫిట్‌తో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది ఈ భామ. ఇండస్ట్రీలోకి సినీ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జైన్ మేరీఖాన్ వెనుక ఒక పెద్ద సినీ నేపథ్యమే ఉంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మన్సూర్ ఖాన్ కూతురిగా, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు (Amirkhan) స్వయానా మేనకోడలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జైన్ మెరీ ఖాన్. హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. గ్లామర్ ఫీల్డ్‌లో టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి అనడానికి జైన్ ఖాన్ ఒక ఉదాహరణ. అడివి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ లీడ్‌ రోల్స్‌ లో వస్తున్న 'డెకాయిట్‌' (Decoit) చిత్రంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ లో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో ఆమె ఒక డేరింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా రాని హైప్.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఈవెంట్‌లో జైన్ మేరీ ఖాన్ తన డ్రెస్సింగ్ సెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. స్క్రీన్ మీద సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా చూసిన జనం, ఈవెంట్‌లో ఆమె గ్లామర్ అవతారాన్ని చూసి షాక్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజు అందరి కళ్లు అమ్మడి వైపే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా జైన్ ఖాన్ ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. నెటిజన్లు ఆమె అందానికి, కాన్ఫిడెన్స్‌కు ఫిదా అయిపోతున్నారు. ఇన్నేళ్లుగా రాని పాపులారిటీ కేవలం కొన్ని గంటల్లోనే రావడంతో జైన్ ఖాన్ కూడా ఫుల్ ఖుషీగా ఉందట. టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో జైన్ సక్సెస్ అయింది. మరి 'డెకాయిట్' సినిమాతో ఈ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Updated Date - Apr 06 , 2026 | 01:10 PM