సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాగార్జున నీకసలు సిగ్గుందా.. యూట్యూబర్ అన్వేష్ ఫైర్

ABN, Publish Date - Sep 09 , 2026 | 07:10 PM

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతనికి ప్రపంచ యాత్రికుడు అనే పేరు కూడా ఉంది. ప్రపంచ దేశాలు తిరుగుతూ.. అక్కడ జీవన శైలి ఎలా ఉంది అని ఫిల్టర్ లేకుండా చెప్తూ ఉంటాడు.

Akkineni Nagarjuna

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతనికి ప్రపంచ యాత్రికుడు అనే పేరు కూడా ఉంది. ప్రపంచ దేశాలు తిరుగుతూ.. అక్కడ జీవన శైలి ఎలా ఉంది అని ఫిల్టర్ లేకుండా చెప్తూ ఉంటాడు. ఒకప్పుడు ఇతనిపి ఇండియాలో చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ల గురించి అతను మాట్లాడిన విధానం అద్భుతమని నెటిజన్స్ చెప్పుకొచ్చారు. కానీ, ఎప్పుడైతే అన్వేష్.. నటుడు శివాజీ అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించడం ఇండియన్స్ కి నచ్చలేదు. దీంతో అతనిపి ఇండియన్స్ దుమ్మెత్తిపోశారు. అంతేకాకుండా పోలీస్ కేసులు కూడా పెట్టారు. ఆ తరువాత కొద్దిగా సైలెంట్ అయిన అన్వేష్.. ఇప్పుడు మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ పై మండిపడ్డాడు.


ఇటీవల అగ్ని పరీక్ష 2 కార్యక్రమానికి చెందిన కొందరు కంటెస్టెంట్స్ తమ ఓట్ల కోసం స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. చదువుకునే విద్యార్థుల వద్దకు వెళ్ళి ఇలాంటి రియాలిటీ షోల ప్రచారాలు చేయడం సరికాదని, విద్యాసంస్థల యాజమాన్యాలు దీనికి ఎలా అనుమతించాయని పలువురు విమర్శించారు. ఈ విషయంపై స్పందించిన అన్వేష్, ఈ అంశంపై నాగార్జున మౌనంగా ఉండటాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. కంటెస్టెంట్లు తెలియక తప్పు చేసినప్పటికీ, ఒక సీనియర్ నటుడిగా, బాధ్యతాయుత స్థానంలో ఉన్న నాగార్జున ఆ ప్రచారాలను ఖండించాల్సిందని అభిప్రాయపడ్డాడు.' స్కూల్ లో కాకుండా సినిమా హాళ్ల దగ్గర, బయట, లేకపోతే ఇంకెక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు కదా.. చదువుకొనే పిల్లలను చెడగొట్టడం.. అది కూడా ఇలాంటి షో కోసం.. ఇది పడ్డది కాదని చెప్పుకొచ్చాడు.


అంతేకాకుండా, నాగార్జున వయసు,కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ అన్వేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'మీకు 70 ఏళ్లు వచ్చాయి, ఇద్దరు కొడుకులు ఉన్నారు, త్వరలోనే తాత కాబోతున్నారు, ఇలాంటి సమయంలో తప్పులను ఖండించకుండా మౌనంగా ఉండటం సరికాదు. బిగ్ బాస్ యాజమాన్యానికి అంటే సిగ్గులేదు.. మీకు కూడా సిగ్గు లేదా.. అమల గారు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు. మీరెందుకు ఇలాంటి పనులు ఆపడం లేదు. మీరేమి బాలాకుమారులు కాదు.. 70 ఏళ్లు వచ్చాయి. ఇంకో 15 ఏళ్లు ఉంటే మీరు కూడా చనిపోతారు. అప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి పోరంబోకులు పంపిన హోస్ట్ అంటూ చెప్పుకుంటారు' అని ఘాటుగా మండిపడ్డారు. సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని హితవు పలికాడు.


ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల మధ్య తీవ్రమైన చర్చ నడుస్తోంది. కొందరు అన్వేష్ విమర్శలకు మద్దతు తెలపగా, మరికొందరు మాత్రం నాగార్జునపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తగదని ఆక్షేపిస్తున్నారు. ఈ వివాదంపై నాగార్జున లేదా బిగ్ బాస్ టీమ్ స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Updated Date - Sep 09 , 2026 | 07:10 PM