ఇట్లు అర్జునకి అండగా ఎన్టీఆర్..
ABN, Publish Date - Nov 03 , 2026 | 09:35 PM
కొత్త నటుడు అనీష్ (Aniesh), మలయాళ భామ అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వినూత్న రొమాంటిక్ డ్రామా ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్ నాగార్జున ప్రత్యేకంగా సమర్పిస్తుండగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన సొంత బ్యానర్ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించాడు.
కొత్త నటుడు అనీష్ (Aniesh), మలయాళ భామ అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వినూత్న రొమాంటిక్ డ్రామా ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్ నాగార్జున ప్రత్యేకంగా సమర్పిస్తుండగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన సొంత బ్యానర్ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించాడు. మూగ, చెవిటి వైకల్యం ఉన్న ఒక సాధారణ యువకుడి వినూత్న ప్రేమకథ, ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఎమోషన్స్ నేపథ్యంగా ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో అనీష్, అనస్వర రాజన్ అలరించబోతున్నారు.
అన్ని బావుండి ఉంటే ఈపాటికే ఇట్లు అర్జున్ రిలీజ్ కావాల్సింది. కానీ, ఆదర్శ కుటుంబం సినిమాతో పోటీ ఎందుకు అని వెనక్కి తగ్గి నవంబర్ 13 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి అండగా మ్యాన్ ఆఫ్ మాసెస్ నిలబడ్డాడు. ఈ సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్.. నవంబర్ 4 న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్ రానుండటంతో ఈ చిన్న చిత్రంపై ఒక్కసారిగా టాలీవుడ్ వ్యాప్తంగా భారీ అంచనాలు నమోదయ్యాయి. అనీష్ తండ్రి మహేష్ రెడ్డి.. తారక్ కి మంచి స్నేహితుడు. ఆ స్నేహంతోనే తారక్.. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నట్లు టాక్.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలై సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన మూడు పాటలకు శ్రోతల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. రాజా మహాదేవన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ, విజువల్స్ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రం నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రేపు రాబోతున్న ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్‌తో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగి, బాక్సాఫీస్ వద్ద మంచి ప్రమోషన్ బజ్ సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అనీష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.