సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Paradise: దున్నేస్తున్న.. ఏషనాగుల సాంగ్! అటు ప్ర‌శంస‌లు.. ఇటు ట్రోలింగ్‌

ABN, Publish Date - Aug 30 , 2026 | 04:59 PM

శ‌నివారం విడుద‌లైన ఏషనాగుల సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రోజు గ‌డ‌వ‌క ముందే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుని సంచ‌ల‌న రికార్డులు న‌మోదు చ‌స్తోంది.

The Paradise

నేచురల్ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise). ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, ‘ఆయా షేర్’ ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే.. ఈ మూవీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘ఏషనాగుల’ (YeshaNagula) పాటను తాజాగా డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో నాని సమక్షంలో ఆవిష్కరించారు. ఆపై డిజిటల్‌గా విడుదలైన ఈ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రోజు గ‌డ‌వ‌క ముందే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుని సంచ‌ల‌న రికార్డులు న‌మోదు చ‌స్తోంది.

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించిన ఈ హై-వోల్టేజ్ ఫోక్ మాస్ ఆంథమ్ మొదటి బీట్ నుంచే ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన పక్కా లోకల్ తెలంగాణ ఫోక్ లిరిక్స్ ‘ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాలా.. మనం ఊగుదామే బాలా’ పాటకు ప్రాణంగా నిలిచాయి. ప్రభా బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డి తమ పవర్‌ఫుల్ జానపద గాత్రంతో పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. వీడియోలో నాని తన ఊరమాస్ రా లుక్‌లో కనిపిస్తూ ఎనర్జిటిక్ మూమెంట్స్‌తో దుమ్మురేపగా, కీర్తి సురేష్ చేసిన స్పెషల్ డ్యాన్స్ అండ్ గ్లామరస్ ఫోక్ స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఆట సందీప్, జ్యోతి రాజ్ కొరియోగ్రఫీ చేసిన ఈ మాస్ నంబర్ థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో వందలాది డ్యాన్సర్ల మధ్య సాగే విజువల్స్, సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండియర్‌ను స్పష్టంగా చూపించాయి. మొత్తం మీద ‘ఏషనాగుల’ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్, స్టెప్పులు వేయించేలా అదిరిపోయే మాస్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం సహా పలు అంతర్జాతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

అయితే.. ఈ పాట ఓ వైపు సామాజిక మాధ్య‌మాల‌ను దున్నేస్తుంటే.. మ‌రోవైపు ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. చాలామంది ఆ పాట మాధుర్యాన్ని చెడ‌గొట్టార‌ని, దానికి ఉన్న విలువ‌ను చెడ‌గొట్టారంటూ మండి ప‌డుతున్నారు. అంతేగాక తాజా పాట‌కు స‌మ‌కూర్చిన నృత్య రీతులు ఏమాత్రం సెట్ అవ్వ‌లేద‌ని దుయ్య బ‌డుతున్నారు. అక్క‌డ వ‌చ్చే పాట‌కు ఆ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌కి సంబంధమే లేద‌ని అస‌లు పాట‌కు త‌గ్గ‌ట్లు డ్యాన్స్ బీట్స్ లేవ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ పాత పాట‌ను అలాగే పెట్టి ఉన్నా బావుండేద‌ని ఆ పాత పాట‌ను ఈ కొత్త పాట ఏమాత్రం మ్యాచ్ చేయ‌లేక పోయింద‌ని అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 05:28 PM