సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోయిన్ల కోసం దిల్ రాజు తిప్పలు.. ఇంతకీ ‘ఎల్లమ్మ’ ఛాన్స్ ఎవరికో..

ABN, Publish Date - Jul 04 , 2026 | 07:36 PM

హీరో ఎవరో, అసలు కథేంటో బయటకు రాకముందే సోషల్ మీడియాను షేక్ చేసిన ఏకైక సినిమా ఏదైనా ఉందంటే.. అది ‘ఎల్లమ్మ’ మాత్రమే. ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచే ఏదో ఒక విషయంలో ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి.

Yellamma Update

ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే భారీ హైప్ తెచ్చుకోవడం సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకే సాధ్యమవుతుంది. కానీ, హీరో ఎవరో, అసలు కథేంటో బయటకు రాకముందే సోషల్ మీడియాను షేక్ చేసిన ఏకైక సినిమా ఏదైనా ఉందంటే.. అది ‘ఎల్లమ్మ’ (Yellamma) మాత్రమే. అయితే ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచే ఏదో ఒక విషయంలో ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. మొదట హీరో విషయంలో తలెత్తితే, ఇప్పుడేమో హీరోయిన్‌ విషయంలో ఊహించని ఇబ్బందులు వస్తున్నాయి.


‘బలగం’ (Balagam).. తెలంగాణ పల్లెల్లోని బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలు కళ్ల ముందు మెదులుతాయి. ఆ సినిమాతో అందరి మనసులను కదిలించిన డైరెక్టర్ వేణు యెల్దండి ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే ‘ఎల్లమ్మ’. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘బలగం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఆడియన్స్‌లో ఈ ప్రాజెక్ట్‌పై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా ఎంతో మంది స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. ఎన్నో చేతులు మారిన ఈ కథ.. అనూహ్యంగా మన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) దగ్గర సెటిలైంది. సంగీత దర్శకుడిగా ఎన్నో సంచలనాలు సృష్టించిన దేవి శ్రీ ప్రసాద్, ఈ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అంతేకాదండోయ్.. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫుల్ బిజీగా ఉన్న దేవి శ్రీ ప్రసాద్, ఈ సినిమా కోసం పలు క్రేజీ మ్యూజిక్ ఆఫర్లను సైతం సున్నితంగా తిరస్కరించారట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ కథపై ఆయనకెంత నమ్మకం ఉందో! దానికి తగ్గట్టే రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోతోనే ఎల్లమ్మ సినిమా ఆడియన్స్‌ దృష్టిని బలంగా ఆకర్షించింది.


హీరోగా దేవి శ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యాడు సరే.. ఇక హీరోయిన్ సంగతేంటి? ఇక్కడే అసలు కథ మొదలైంది. హీరో విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, హీరోయిన్ విషయంలో అంతకు మించిన కష్టాలే ఎదురవుతున్నాయట చిత్రయూనిట్‌కు. ఎందుకంటే, ఎల్లమ్మ సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉందో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే సమానమైన ఇంపార్టెన్స్ ఉందట. ఈ బలమైన పాత్ర కోసం ముందుగా కీర్తి సురేష్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ తర్వాత రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ సినిమాతో కుర్రకారును హుషారెత్తించిన భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, కాల్ షీట్స్ సమస్యల వల్ల భాగ్యశ్రీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. దీంతో హీరోయిన్ వేట మళ్లీ మొదటికొచ్చింది. వేణు యెల్దండి మార్క్ విలేజ్ డ్రామాలో, దేవిశ్రీ ప్రసాద్‌కు జోడీగా నటించే ఆ లక్కీ ఛాన్స్ ఏ స్టార్ హీరోయిన్‌ను వరించనుందో..? లేక ఈ పాత్ర కోసం ఏదైనా కొత్త ముఖాన్ని పరిచయం చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్? కారణమిదేనా?!

ఇదే ఈ బాబాయ్- అబ్బాయ్ డెబ్యూ స్పెషాలిటీ!

అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!

Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా

Updated Date - Jul 04 , 2026 | 07:36 PM