సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Toxic: కామ్ డౌన్.. లేడీ గ్యాంగ్ వచ్చే టైం ఆసన్నమైంది

ABN, Publish Date - Jun 30 , 2026 | 02:44 PM

కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా ‘టాక్సిక్‌’: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ -అప్స్‌'. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నడ స్టార్‌ యష్‌ (Yash) హీరోగా నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా ‘టాక్సిక్‌’: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ -అప్స్‌'. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా ఇలా ఎక్కువమందే హీరోయిన్స్‌ ఉన్నారు. ఈ చిత్రంలో వీరి పాత్రలేంటి? ఎలా ఉండబోతున్నాయి? ఎవరేం చేస్తాం అన్నది రివీల్‌ చేయడానికి చిత్ర బృందం టైమ్‌ ఫిక్స్‌ చేసింది. జూలై 1 ఉదయం 11 గంటల 33 నిమిషాలకు లేడీ గ్యాంగ్‌ రివీల్‌ చేస్తున్నట్లు యశ్‌ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇందులో నటించే హీరోయిన్ల రోల్స్‌ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే రేపటి వరకూ వేచిచూడాల్సిందే. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 26న విడుదల కానుంది.

ఇదిలా ఉండగా ఈచిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న హ్యూమా ఖురేషీ ఈ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఓ విజువల్‌ ట్రీట్‌ అని చెప్పారు. ఆమె మాట్లాడుతూ ‘యశ్‌ కలిసి పనిచేశాక ఆయనకు విపరీతమైన అభిమానినయ్యా. అంతకుముందు ఆయనొక పెద్ద స్టార్‌. ఆయనకు భారీ ఫాలోయింగ్‌ ఉంది అని మాత్రమే నేను అనుకునేదాన్ని. కానీ ఆయన పని చేేస విధానాన్ని, డెడికేషన్‌ చూశాక చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా తర్వాత యశ్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. ఇటీవల సినిమాలో చిన్న సన్నివేశం చూశాను. నేను ఇప్పటి వరకూ అలాంటి విజువల్స్‌ ఏ సినిమాలోనూ చూడలేదు. ఆ సన్నివేశాలకు ప్రేక్షకులకు ఫిదా అయిపోతారు’ అని అన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 03:32 PM