సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి .. పెళ్లి సాంగ్ అదిరింది

ABN, Publish Date - Jun 29 , 2026 | 12:58 PM

ఇటీవ‌ల పాపం ప్ర‌తాప్ సినిమాతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన తిరువీర్ ఇప్పుడు ఓ సుకుమారి అంటూ ప‌ల‌క‌రించేంద‌కు రెడీ అయ్యాడు.

Oh Sukumari

ఇటీవ‌ల పాపం ప్ర‌తాప్ సినిమాతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన తిరువీర్ (Thiruveer) ఇప్పుడు ఓ సుకుమారి (Oh Sukumari) అంటూ ప‌ల‌క‌రించేంద‌కు రెడీ అయ్యాడు. ఔట్ అండ్ ఔట్ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా ద్వారా భ‌ర‌త్ ద‌ర్శ‌ణ్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తుండగా ఐశ్వ‌ర్యా రాజేశ్ (Aishwarya Rajesh) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన పాట‌, టీజ‌ర్ సినిమాపై మంచి బ‌జ్ తీసుకు రాగా తాజాగా సోమ‌వారం ఈ సినిమా నుంచి యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి (YaadhiGani Pelli) అంటూ సాగే హుషారైన లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ ద‌ర్శ‌ణ్ స్వ‌యంగా సాహిత్యం అందించ‌గా భ‌ర‌త్ మాచిరాజు (Bharath Manchiraju) సంగీతంలో ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు జెస్సీ గిఫ్ట్ (Jassie Gift) ఆల‌పించాడు. ఇక పాట విష‌యానికి వ‌స్తే 3 నిమిషాల 45 సెకండ్లు ఉన్న ఈ గీతం అసాంతం సాహిత్యం క‌న్నా మ్యూజిక్ తోనే సాగ‌డం విశేషం. తెలంగాణ‌లో జ‌రిగే పెళ్లి ఈ సంద‌ర్భంగా జ‌రిగే బ‌రాత్‌, సంబురాలు అన్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. మీరూ ఈ వీడియోపై ఓ లుక్ వేయండి మ‌రి.

Updated Date - Jun 29 , 2026 | 12:59 PM