Samantha: నెలసరి నుంచి మానసిక ఒత్తిడి వరకు.. సమంత ఏం చెప్పారంటే..
ABN, Publish Date - Oct 11 , 2026 | 12:05 PM
నేటి కాలంలో మహిళలు ప్రతి అంశంపై కూడా నిర్భయంగా మాట్లాడుతూ తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతున్నారని హీరోయిన్ సమంత అన్నారు.
నేటి కాలంలో మహిళలు ప్రతి అంశంపై కూడా నిర్భయంగా మాట్లాడుతూ తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతున్నారని హీరోయిన్ సమంత అన్నారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, ‘మహిళలు తమ ఆరోగ్యం, హార్మోన్స్, గర్భం, మానసికస్థితి, నిద్ర, ఆహారం, మానసిక ఒత్తిడి, శృంగారం ఇలా ప్రతి అంశంపై ఎంతో చైతన్యవంతంగా మాట్లాడటం ప్రారంభించారు. గతంలో రుతుక్రమం (నెలసరి), ఇతర అనారోగ్య సమస్యలను బయటకు చెప్పుకోలేక తమలోనే దాచుకునేవారు.
కానీ, ఇపుడు ప్రతి సమస్యను బయటకు వెల్లడిస్తూ, దానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఆసియా క్రీడల్లో స్వర్ణ రజత, కాంస్య పతకాలను గెలుచుకుని, 40 యేళ్ళుగా ఉన్న పరుగుల రాణి పీటీ ఉష రికార్డును బద్ధలు కొట్టిన విద్యా రామరాజ్‌ను సమంత ప్రత్యేకంగా అభినందించారు.
ALSO READ:
Raviteja: రవితేజ 'తులాభారం' మొదలైంది
Kaaka: ‘కాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్..
రణబాలి ఓవర్సీస్.. ఇతర భాషల్లో వెనక్కి వెళ్లినట్టేనా
Aditi Rao Hydari: గ్లామర్ ప్రపంచంలోనూ నాలోని చిన్నారిని కాపాడుకుంటున్నా..