AR Rahman: రామ్ చరణ్ డ్యాన్స్‌తో.. నా పాటలను మరో స్థాయికి తీసుకెళ్లాడు
ABN, Publish Date - May 24 , 2026 | 12:43 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందిన చిత్రం పెద్ది (Peddi) మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మధ్యప్రదేశ్ భోపాల్‌లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరిట ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, చిత్ర బృందం మూడవ సింగిల్ 'హల్లల్ల ల్లో' ని భోపాల్‌లో జరిగిన 'పెద్ది కి ఆవాజ్' బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్ ఆయన బృందం ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ (AR Rahman) మాట్లాడుతూ.. భోపాల్ ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి సమక్షంలో ఈ ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ దేశమంతటా ప్రేక్షకులను అలరిస్తుండటం గర్వంగా అనిపిస్తోందన్నారు.
నేను సంగీతం అందించిన ఎన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాపై అపారమైన ప్రేమ, ఆదరణ చూపించారు. చాలా కాలంగా నేరుగా ఒక తెలుగు సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం రావడం ఆనందంగా ఉంది అని సంతోషం వ్యక్తం చేశారు..
బుచ్చిబాబు గారు ఈ కథను చెప్పినప్పుడు ఈ కథ, ఆయనలోని ప్యాషన్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన పాటలన్నింటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్‌తో నా పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ప్రతి మూమెంట్ వైరల్ అయింది. అలాగే జాన్వీ కపూర్ కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఈ ప్రేమాభిమానాలకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.