సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

SSMB మంత్‌ మొదలైంది.. 'వారణాసి' అప్‌డేట్‌ వచ్చేనా..?

ABN, Publish Date - Aug 01 , 2026 | 11:18 AM

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులకు అత్యంత ఇష్టమైన నెల ఆగస్టు వచ్చేసింది. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో SSMB మంత్ హంగామా అప్పుడే వేడెక్కింది.

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులకు అత్యంత ఇష్టమైన నెల ఆగస్టు వచ్చేసింది. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో SSMB మంత్ హంగామా అప్పుడే వేడెక్కింది. ప్రతి ఏటా ఈ సమయానికి మహేష్ కొత్త సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి మరింత ప్రత్యేకంగా మారింది. దానికి కారణం.. దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ అడ్వెంచరస్ డ్రామాపై పాన్ ఇండియా స్థాయిని మించి గ్లోబల్ లెవెల్‌లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' వంటి సంచలనం తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో, హాలీవుడ్ వర్గాలు కూడా ఈ ప్రాజెక్ట్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది చిత్రయూనిట్. ప్రస్తుతం మరికొన్ని అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లను తెరకెక్కించడంలో రాజమౌళి బిజీగా ఉన్నారు. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన లుక్‌తో పాటు ప్రత్యేకమైన శారీరక మేకోవర్‌తో కనిపించబోతున్నారు. పైగా జక్కన్న రిస్ట్రిక్షన్స్‌ తో మహేష్‌ బయటి ఈవెంట్స్ కు చాలా వరకు తగ్గించేశారు. తన సొంత అన్న కొడుకు సినిమా ప్రమోషన్స్‌కు కూడా మహేష్ రాలేకపోయారు. సాధారణంగా మహేష్ ప్రతి పుట్టినరోజుకు తన సినిమాకు సంబంధించిన ఏదో ఒక పోస్టర్ లేదా గ్లింప్స్ విడుదల కావడం ఆనవాయితీ. గతేడాది మహేష్‌ బర్త్‌డేకు ఒక పోస్టర్‌తో చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చి, నవంబర్‌లో ప్రీ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌కు ఊహించని కిక్‌ ఇచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, 'అవతార్' సృష్టికర్త జేమ్స్ కామెరూన్ సైతం ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సుల పట్ల ప్రశంసలు కురిపించారంటే.. ఈ ప్రాజెక్ట్ స్కేల్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ ఏడాది మహేష్‌ పుట్టినరోజుకు రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్‌ రాబోతుందనే అంశంపై ఫ్యాన్స్ ఫుల్ సస్పెన్స్‌లో ఉన్నారు. ఒక చిన్న పోస్టర్ లేదా లుక్ రిలీజ్ అయినా సోషల్ మీడియా రికార్డులను తిరగరాయడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మరి జక్కన్న టీమ్‌ ఈసారి మాస్ సర్‌ప్రైజ్ ఇస్తుందా లేక మరికొన్నాళ్లు ఆగమని షాక్ ఇస్తుందో వేచి చూడాలి. సినిమా రిలీజ్ విషయంలోనూ మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసే దిశగానే పనులు వేగవంతం చేశారు. ఒకవైపు శరవేగంగా చిత్రీకరణ జరుపుతూనే, వీలు చిక్కినప్పుడల్లా హాలీవుడ్ స్థాయిలో జరిగే అంతర్జాతీయ ఈవెంట్లలో వారణాసి టీమ్ ప్రమోషన్లను కొనసాగిస్తోంది. ముఖ్యంగా సినిమాలో నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ విషయంలో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా హాలీవుడ్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి, రాజమౌళి టేకింగ్ విజన్ గురించి ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు సినిమాకు గ్లోబల్ వైడ్‌గా భారీ బజ్ తెచ్చిపెడుతున్నాయి. తెలుగు సినిమా స్థాయిని, భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ వేదికపై మరో ఎత్తుకు తీసుకెళ్తున్న రాజమౌళి.. ఈ ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే కానుకగా ఫ్యాన్స్‌కి ఎలాంటి స్పెషల్ ట్రీట్ ఇస్తారో చూడాలి..!

Updated Date - Aug 01 , 2026 | 11:36 AM